డీఎస్
అమెరికాలో ఉన్న అల్లుడుగారి గురించి ఇండియాలో ఉన్న అత్తగారి కలిపే పులిహోర.
ఇలాంటి పులిహోర ఏమైనా మీకు ఎదురైతే (లేక మన చేష్టలపై మనమే నవ్వుకో గలిగినవి) మీరూ ఒక చెయ్య వేయాలంటే శాకాన్ని ipulihora@gmail.com కి పంపండి, అందరికీ పంచుదాం!
Wednesday, June 8, 2011
అమెరికా లో ఉండబట్టి PCC రేసులో లేరు కానీ అల్లుడు గారు కూడా సత్తి బాబు లానే తెలంగాణా ని సపోర్ట్ చేసారు!
సందడిలోడీఎస్ పులిహోర
సత్తిబాబే సరైన నాయకుడు
డీఎస్ హైదరాబాద్, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో పీసీసీకి బొత్స సత్యనారాయణే సరైన నాయకుడని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. ''ఆయన కంటే మంచి అధ్యక్షుడు ఇంకెవరున్నారు? ఎందుకంటే తెలంగాణ వాదానికి అనుకూలంగా ఆయన మాట్లాడాడు. రాష్ట్ర విభజనలో తప్పేమీ లేదని అందరి ముందూ చెప్పారు. తెలంగాణలో ఆయన స్థాయిలో నాయకుడు ఎవరూ లేరనడం లేదు. అధ్యక్షుడి నియామకమనేది అధిష్ఠానం విశేషాధికారం. పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ తెలంగాణ సాధిస్తానని నేను చెప్పా. ఇతర ప్రాంతానికి చెందిన సత్తిబాబు అలా మాట్లాడడం గొప్ప విషయం'' అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నపుడు పీసీసీ అధ్యక్ష పదవిని తెలంగాణవారికే ఇవ్వాలనే నిబంధనేమీ పార్టీలో లేదని చెప్పారు. బొత్స తనకు వ్యక్తిగతంగా సన్నిహితుడని, అందరినీ కలుపుకొని వెళుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను సమన్వయపరచగలరన్న నమ్మకం తనకుందని చెప్పారు. తన సహకారం బొత్సకు ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విషయమై అవసరాన్ని బట్టి నిర్ణయం చెబుతానన్నారు. ముఖ్యమంత్రితో తనకు పొసగలేదన్న వాదనను ఖండించారు. ఆజాద్ తెలంగాణ సమస్య పరిష్కారానికి సమయం పడుతుందన్నారే తప్ప రాష్ట్రాన్ని ఇవ్వం, ఇచ్చేది లేదనలేదని గుర్తు చేశారు.
డీఎస్
Subscribe to:
Posts (Atom)